ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ (Nalgonda) జిల్లాలో రైతాంగాన్ని యూరియా (Urea) కొరత తీవ్రంగా వేధిస్తోంది. అవసరం ఉన్న రైతులందరికీ యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలో కోదాడ-జడ్చర్ల హైవే (Kodada-Jadcharla Highway) పై రైతులు రాస్తారోకో చేశారు.
వేల రూపాయలను ఖర్చుపెట్టి వరిసాగు చేస్తే సకాలంలో యూరియా (Urea) వేస్తేనే పంట దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. యూరియా కోసం గంటల కొద్ది క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొందని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ యూరియా (Urea) అందించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని రైతులు హెచ్చరించారు. హైవేపై రైతులు రాస్తారోకో చేయడంతో రోడ్డు కిరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు (Police) రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరవింపజేశారు.

