ధారూర్, మే 5 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ధారూర్ గ్రామంలో రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూమార్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతులు తమ సమస్యలు ఎమైనా ఉంటే సమావేశంలో శాస్త్రవేత్తల ముందుకు తీసుకురావాలని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయ అనుసంధానంగా కోళ్లు, బర్రెలు, తదితర వాటిని ఏర్పాటు తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Vikarabad | ప్రారంభమైన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం
