అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
- ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి
- లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నిం చిన రైతులు
- రైతులను ఆదుకొని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తాం..
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి,
- బీజేపీ జిల్లా అధ్యక్షు లు దినేష్ పటే ల్ కులాచారి
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇటీవల కురి సిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రైతులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటే ల్ కులాచారి డిమాండ్ చేశారు. మం గళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధ న్ నియోజకవర్గంలో, రూరల్ నియోజక వర్గా ల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపో యిన రైతులు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.
రైతులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు మేడపాటి ప్రకాష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్య క్షులు దినేష్ పటే ల్ కులాచారిలు కలెక్టరేట్ గేటు వద్ద లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావ రణం నెలకొంది. ప్రభు త్వ నిరంకుశ వైఖరిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బిజెపి నాయకులతో కలిసి రైతులు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటే ల్ కులా చారి, రైతులు మాట్లా డారు.

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమ యానికి నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల ధాటికి జిల్లా వ్యాప్తంగా సుమా రు 6000 ఎకరాలకు పైగా పంట నష్టం సంభ వించిందన్నారు. ప్రధా నంగా జక్రాన్‌పల్లి, ధర్ప ల్లి, సిరికొండ, డిచ్‌పల్లి మండలాల్లో సుమారు 3,300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, సా లూర మండలంలోని హున్స, కాజపూర్, మం దార్ణ గ్రామాల్లో సుమా రు 2000 ఎకరాలకు పైగా అరటి, మొక్క జొన్న, వరి పంటలు నష్టపోయాయని వాపోయారు.
అన్నదాతల గోడు పట్టదా?

నష్టపరిహారం కోరుతూ వినతిపత్రం ఇచ్చేం దు కు రైతులతో కలిసి వెళితే.. కలెక్టరేట్ గేట్లు మూసివేసి, లోపలికి వెళ్లనివ్వకుండా పోలీ సులు అడ్డుకోవడం దారుణమనీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలె క్టర్ వచ్చి తమను లోప లికి తీసుకువెళ్లి నప్ప టికీ, జిల్లా కలెక్టర్ కనీ సం బయటకు వచ్చి అన్నదాతల గోడు విన కపోవడం అత్యంత శోచనీయం అన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు అల్లాడుతుంటే వారి పట్ల అధికార యం త్రాంగం ఇంత అమాన వీయంగా వ్యవహరిం చడం ఏమిటని రైతుల ప్రశ్నించారు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ప్రకృతి కన్నెర్రజేసి రైతు లు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విలవిలలా డుతుంటే, అధికార యంత్రాంగం నుండి కనీస స్పందన కరువ వ్వడం తీవ్ర విచారకర మని రైతులు, బిజెపి నాయకులు మండిపడ్డా రు. తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధి కారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. నష్ట పోయిన ప్రతి ఎకరాకు కనీసం రూ.50,000 చొప్పున వెంటనే నష్టపరిహారం చెల్లిం చాలన్నారు.రైతుల బ్యాంకు రుణాల వసూ ళ్లపై తక్షణమే వాయిదా (మొరటోరియం) ప్రక టించాలన్నారు.
వ్యవసాయ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ను త్వరిత గతిన పరిష్కరించేలా సంబంధిత అధికా రులకు ఆదేశాలు జారీ చేయాలని ముక్తకం ఠంతో డిమాండ్ చేశా రు. రైతుల కష్టాన్ని, ఆవేదనను ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవా లని లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్ర మాలు చేపడతామని బిజెపి నాయకులు ప్రకాశ్ రెడ్డి ,దినేష్ పటేల్ కులచారి ప్రభు త్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంద గట్ల రాంచందర్, పాను గంటి సతీష్ రెడ్డి. నా యిడి రాజన్న, అమంద్ విజయ్,సాలుర మం డల అధ్యక్షులు గంగా ధర్, వినోద్ రెడ్డి, కోల ఇంద్రకరణ్, ద్యాగ సరి న్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, రైతులు పాల్గొన్నారు
