Farmers | జాగ్రత్తగా ఉండండి

Farmers | జాగ్రత్తగా ఉండండి

  • నివారణ చర్యలు … సలహాలు సూచనలు

Farmers | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు యాసంగిలో వ్యవసాయ బోరుబావుల కింద సాగుచేసిన వరి పంటకు ప్రధానంగా కాండం తొలిచే పురుగు వస్తుండడంతో దిగుబడి గణనీయంగా తగ్గుతుందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ బోరు బావుల కింద సాగుచేసిన వరి సాగులో పంట దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రధాన పురుగులలో కాండం తొలిచే పురుగు ఒకటని, దీనిని సమర్థవంతంగా నియంత్రించేందుకు సరైన దశలో నివారణ చర్యలు చేపట్టడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాల, సూచనలు మేరకు మందులు పిచికారి చేస్తే వరి కాండం తొలిచే పురుగు నుండి నివారించ వచ్చన్నారు.

గుళికల రూపంలో మందులు…

Farmers

నాటిన 15–35 రోజుల వరకు పొలంలో తగినంత నీరు నిల్వ ఉంచి, 10–15 కిలోల ఇసుకలో మందును కలిపి సమానంగా చల్లాలని సూచించారు. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి – ఎకరాకు 8 కిలోలు, క్లోరాంట్రా నిలిప్రోల్ 0.4జి – ఎకరాకు 4 కిలోలు, లేదా థయా మెథాక్సామ్ 1 శాతం తో పాటు క్లోరాంట్రా నిలిప్రోల్ 0.5 శాతం, జి.ఆర్ ఎకరాకు 2.5 కిలోలు వాడాలన్నారు. సుడిదోమ ఆశించే అవకాశం ఉన్నప్పుడు అనుకూలం థియో సైక్లామ్ హైడ్రోజన్ ఆక్సలేట్ 4 శాతం జి ఆర్ ఎకరాకు 5 కిలోలు వాడాలని సూచించారు.

కాండమ్ తొలిచే పురుగుకు మందులు పిచికారి చేసే విధానం…

వరి పంట నాటిన 40–60 రోజుల దశలో పంట ఎదుగుదల దశలో క్రింది మందులను పిచికారి చేయడం వల్ల సుడి దోమను తగ్గించ వచ్చన్నారు. కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్పీ – ఒక లీటరు నీటికి 2 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 18.5 ఎస్సీ ఒక లీటరు నీటికి 0.3 మి.లీ వాడాలన్నారు.

వరిలో తెల్ల కంకి బయటకు వచ్చిన అనంతరం పురుగుల మందులు వాడటం వల్ల ఆశించిన ఫలితం ఉండదని అన్నారు. రైతులు ముందస్తు నివారణ చర్యలపై దృష్టి సాధించడం వల్ల వరి పంటకు ఆశించే వివిధ రోగాలను నివారించి మందులు పిచికారి చేయడం వల్ల ఆశించిన ఫలితం వస్తుందన్నారు. రైతులు విధిగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు.

Leave a Reply