Farmer… for you | రైతన్నా.. మీ కోసం

Farmer… for you | రైతన్నా.. మీ కోసం
Farmer… for you | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు ప్రతి రైతు వరకు చేరాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే “రైతన్నా… మీ కోసం(Farmer… for you)”.
ఈ అవగాహన కార్యక్రమం ఈ రోజు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం కురుమామిడి పంచాయతీ రెక్కమాను రైతు సేవ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Farmer… for you | రెట్టింపు చేయడమే లక్ష్యం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్(MLA Kandikunta Venkataprasad) మాట్లాడుతూ… ప్రభుత్వం దీర్ఘకాలిక దూరదృష్టితో రూపొందించిన పంచసూత్రాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని తెలిపారు.
నూతన విధానాలు, ఆధునిక సాంకేతికత, తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు, పంట భీమా, నీటి వినియోగ సమర్థత వంటి అంశాలను రైతులు అవలంబిస్తే.. వ్యవసాయం మళ్లీ లాభదాయక రంగమవుతుందని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాలు(Rythu Seva Kendras) రైతుల సమస్యలకు పరిష్కార వేదికగా మారాలనేది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
Farmer… for you | గ్రామస్థాయిలో నేరుగా

రైతు కుటుంబాలన్నింటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా “రైతన్నా… మీ కోసం” కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని ఆయన తెలిపారు. గ్రామస్థాయిలో నేరుగా రైతు ఇంటికే వెళ్ళి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరేలా అంకితభావంతో పని చేస్తామని హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ(Department of Agriculture) అధికారులు పంచసూత్రాల్లోని కీలక అంశాలను వివరించారు. ముఖ్యంగా 1. తక్కువ వ్యయంతో అధిక దిగుబడి పద్ధతులు. 2. ఆధునిక సాగు విధానాలు, డ్రిప్–స్ప్రింక్లర్ టెక్నాలజీ, 3. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల అందుబాటు 4. పంటలకు మార్కెట్ హామీ, ధరల స్థిరీకరణ, 5. రైతు భీమా, సహాయక పథకాల ప్రయోజనాలు, వీటి పై విపులంగా రైతులకు సూచనలు ఇచ్చారు.
Farmer… for you | తరచూ నిర్వహించాలని..

వర్క్‌షాప్(Workshop)లో పాల్గొన్న రైతులు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలపై సానుకూల స్పందన వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని అభ్యర్థించారు. పంటల సమస్యలు, కొనుగోలు విధానాలు, పంట నష్ట పరిహారం, నీటి అందుబాటు వంటి అంశాల పై కూడా రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎన్డీయే కూటమి(NDA Alliance) నాయకులు, పార్టీ కార్యకర్తలు, రైతుసంఘం నాయకులు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొని వర్క్‌షాప్‌ను విజయవంతం చేశారు. గ్రామస్థాయిలో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టిన “రైతన్నా… మీ కోసం” కార్యక్రమం రైతుల్లో చైతన్యాన్ని పెంపొందిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
