Faction| రాజకీయ కక్షతో ఎంపీటీసీపై దాడి

Faction| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ వాతావరణం(Political climate) వేడెక్కుతోంది. నంద్యాల జిల్లాలోని మండలం ఎన్.కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి(MPTC Harinath Reddy) ఈ రోజు పొలానికి వెళ్తుండగా హరినాథ్‌ రెడ్డిపై కొందరు నాయకులు దాడి చేశారని భార్య రిపోర్టు చేశారు. దాడి సంఘటనలో తలపై గాయాలు, శరీరంపై పలుచోట్ల రక్తపు గాయాలు(Bloody wounds) అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఈ గ్రామంలో ఫ్యాక్షన్ గ్రామంగా ఉండేది. ప్రస్తుతం కొంత సద్దుమణిగినప్పటికీ ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త(tension) పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కక్షతోనే తనపై దాడి చేయడం జరిగిందని ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి పోలీసులకు తెలిపారు. తనకు పోలీసు అధికారులు రక్షణ కల్పించాలని(To provide protection) కోరారు. దాడి సంఘటనను తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీటీసీని పరామర్శించారు.

దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పోలీసులను కోరుతూ వినతి పత్రాన్ని(Request letter) ఇచ్చారు. ఈ సంఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జిల్లా ఎస్పీ సునీల్ షేరణ్(SP Sunil Sheran) గ్రామంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

click here to read నాటు బాంబుల కలకలం..

click here to read more

Leave a Reply