వడ్డీ వ్యాపారుడి భూమి స్వాధీనం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లాలో అధిక వడ్డీల ఆశ చూపించి పేదల నుంచి కోట్లాది రూపాయలు సేకరించిన డబ్బులు ఇవ్వకుండా దోబూచులాడుతున్న ఓ వ్యక్తి ఏజెంట్‌పై తండా వాసులు తిరుగుబాటు చేశారు.
పోలీసు స్టేషన్(Police station)కు వెళ్లినా సకాలంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో పీఏ పల్లి మండలం పడమటి తండా(West Thanda)కు చెందిన లక్ష్మ అనే ఏజెంట్‌కు చెందిన 20 ఎకరాల భూమిలో జెండాలు పాతి స్వాధీనం చేసుకున్నారు.
తండావాసుల తిరుగుబాటు…
పీఏ పల్లి మండలం పడమటి తండాకు చెందిన లక్ష్మ అనే ఏజెంట్ దాదాపు 50 మంది వద్ద అధిక వడ్డీ చెల్లిస్తానని చెబుతూ సుమారు రూ. 45 కోట్లలను సేకరించాడు. ఇప్పటికే అరెస్టయిన బాలాజీ నాయక్(Balaji Naik), మధు నాయక్ ల వద్ద తాను ఏజెంట్‌గా పనిచేశానని, ప్రస్తుతం వారు అరెస్టు అయ్యారని, వారు విడుదల అయ్యాక అడిగి ఇస్తానని లక్ష్మా చెప్పాడు. అయినా తండావాసులు పట్టించుకుండా లక్ష్మాకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమి(20 Acres Agricultural Land)ని స్వాధీనం చేసుకున్నారు.
బత్తాయి తోటను ట్రాక్టర్ తో దున్ని స్వాధీనం చేసుకున్న అనంతరం పొలంలో జెండాలను పాతారు. లక్ష్మా ఇంటికి తాళం వేశారు. దీంతో పడమటి తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.