Exams | ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల..

Exams | ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల..

  • వాట్సాప్ గవర్నర్ మనమిత్ర ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..
  • ఫీజు కట్టలేదు హాల్ టికెట్ ఇవ్వమన్నా అంశమే ఉండకూడదు..
  • ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.. పరీక్షకు హాజరు కావచ్చు..

Exams | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల కాలం మొదలైంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఇప్పటికే షెడ్యూల్డ్ ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న యి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ కళాశాలకు చెక్ పెట్టింది. ఫీజు చెల్లిస్తే గాని హాల్ టికెట్లు ఇవ్వం అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేరుగా మనమిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని ఇంటర్మీడియట్ బోర్డు విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాష శుక్రవారం తెలిపారు.

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌బాషా తెలిపారు. విద్యార్థులు https://bie.ap.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా హాల్‌టికెట్లు పొందొచ్చన్నారు.

Exams |

మొదటి సంవత్సరం వారు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. మనమిత్ర వాట్సప్‌ నంబరు 955230 0009కు హాయ్‌ అని మెసేజ్‌ పెట్టి, హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్‌ అవసరం లేదని తెలిపారు.

ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు…
కొత్తగా ద్వితీయ సంవత్సర సిలబస్‌లో మార్పు లు..

Exams |

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పుస్తకాల్లో సమూల మార్పులు చేశారు. జాతీయస్థాయి ప్రవేశపరీక్షలకు తగ్గట్టుగా ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేక విభాగాన్ని రూపొందించారు. రూపకల్పన సైన్స్ సబ్జెక్టుల సిలబస్ అంతా స్టేట్ కౌన్సిల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్ వారిదే బాధ్యతగా పేర్కొన్నారు.

exams-

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన ప్రణాళిక మారిన సిలబస్ అమలవుతుందని విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాష శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు….ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ద్వితీయ సంవత్సర చదువుతున్న విద్యార్థుల పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ నెల 23వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

​హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Exams |-

​విద్యార్థులు ఈ క్రింది వివరాలను ఉపయోగించి తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
​ఆధార్ నంబర్, పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా ​మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ (రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం ఉపయోగించుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ​మీరు చిత్రంలో ఉన్న అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత లింక్ ద్వారా వీటిని పొందవచ్చు. https://bie.ap.gov.in హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ పేరు, ఫోటో, మరియు పరీక్షా కేంద్రం వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని కార్యదర్శి రంజిత్ భాష ఆదేశాల్లో పేర్కొన్నారు.

click here to read more : study|విదేశీ చ‌దువు.. ఇక సులువు

click here to read more :

Leave a Reply