EX MLA | రామగుండంలో ప్రజా వ్యతిరేక పాలన

EX MLA | రామగుండంలో ప్రజా వ్యతిరేక పాలన
- మాజీ ఎమ్మెల్యే విమర్శ
- చిరు వ్యాపారులపై దాడి
- న్యాయం చేయకపోతే మున్సిపల్ ముట్టడి…
- కోరు కంటి చందర్
- కూల్చివేత బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
EX MLA | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : సుందరీకరణ, అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల దుకాణాలను అక్రమంగా కూల్చివేస్తూ కాంగ్రెస్ పాలకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన ఆకుల మల్లేష్‌కు చెందిన షాపును అదే స్థలంలో ఎలాంటి షరతులు లేకుండా తిరిగి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి, సుందరీకరణ సాకుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పూర్తిగా కూల్చివేతలతో నాశనం చేశారని విమర్శించారు. ఓనర్లుగా ఉన్నవారిని కిరాయిదారులుగా మార్చి, పెద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకుల మల్లేష్‌కు షాపుకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నప్పటికీ కూల్చివేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు చెప్పిన విధంగా సెట్‌బ్యాక్ తీసుకున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకుల జోక్యంతో అర్ధరాత్రి షాపును కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో కూల్చివేతకు గురైన చిరు వ్యాపారులందరికీ నష్టపరిహారం చెల్లించి, సింగరేణి చేపడుతున్న నిర్మాణాల్లో వారికి ఉచితంగా దుకాణాలు కేటాయించాలని కోరారు. రెండు రోజుల్లోగా కూల్చివేసిన స్థలంలో తిరిగి నిర్మాణం చేపట్టకపోతే బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మూల విజయ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, గాధం విజయ, జనగామ కవిత, సరోజిని, బాదె అంజలి, నారాయణదాసు మారుతి, బోడ్డుపల్లి శ్రీనివాస్, బుర్రి వెంకటేష్, అచ్చే వేణు, పిల్లి రమేష్, దొమ్మేటి వాసు, మేతుకు దేవరాజ్, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, నీరటి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, జిట్టవేన ప్రశాంత్, ఈదూనూరి శ్రీకాంత్, వీరాలాల్, ఆర్శనపల్లి శ్రీనివాస్, కొడి రామకృష్ణ, గుంపుల లక్ష్మి, నిమ్మరాజుల సాగర్, చింటూ, యాసర్ల తిమోతి, కనకరాజు, గుర్రం పద్మ, సూజాత తదితరులు పాల్గొన్నారు.
