Nomination | రెండవ విడత నామినేషన్లకు సర్వం సిద్ధం..

Nomination | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో సర్వం సిద్ధం చేశామని స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున నామినేషన్ (Nomination) వేసే అభ్యర్థులు సంబంధిత పత్రాలతో ఇద్దరితో వచ్చి నామినేషన్ కేంద్రాలకు నామినేషన్ వేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఎన్నికల అధికారులకు(To Election Officers) సహకరించినట్లయితే శాంతియుత(Peaceful) వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి ఇన్చార్జ్ ఎంపిఓ వెంకట నరసింహారెడ్డి, ఎన్నికల అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
