అంద‌రి సహకారం అవసరం..

  • వ‌న్య ప్రాణులు ర‌క్ష‌ణే ల‌క్ష్యం..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఇన్చార్జి ఆఫీసరు(ఎఫ్ఆర్ఓ)గా కె.మమత గురువారం సాయంత్రం బాధితులు స్వీకరించారు. గత సంవత్సరకాలంగా తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు ఇన్చార్జిగా వ్యవహరించారు.

ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, జన్నారం ల్యాండ్ సర్వేలోని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.మమతను ఇన్ఛార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అడవుల పరిరక్షణకు అంద‌రి సహకారం అవసరమని కోరారు. అక్రమ టేకు కలప నిరోధానికి, వన్యప్రాణుల సంరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply