ప్రతి పర్వదినం మతసామరస్యానికి ప్రతీకే

ప్రతి పర్వదినం మతసామరస్యానికి ప్రతీకే
- ఐక్యతా భావంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేద్దాం..
- శాంతి, సౌభ్రాతృత్వంతో జిల్లాను ఆదర్శవంతంగా నిలబెడదాం..
- శాంతి కమిటీ (పీస్ కమిటీ) భేటీలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు…
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పర్వదినాలు మతసామరస్యానికి ప్రతీకలని.. ఐక్యత, సోదరభావంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ(Collector Dr. G. Lakshmi), ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. విజయవాడ బందర్ రోడ్ లోని కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య(Sri Pingali Venkaiah) సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన శాంతి కమిటీ (పీస్ కమిటీ) భేటీ జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా శాంతి, సౌభ్రాతృత్వంతో ప్రతి పండగనూ జరుపుతున్నామని.. ఇదే స్ఫూర్తితో దసరా ఉత్సవాల విజయవంతానికి చేయీచేయీ కలుపుదామని, జిల్లాను ఆదర్శవంతంగా నిలబెడదామని పేర్కొన్నారు. సోదరభావం, ఐక్యత సుస్థిర ప్రగతికి(for sustainable progress) సోపానాలని.. ఈసారి దసరా ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేందుకు అవకాశముందని.. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పటిష్ట(strong) ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భక్తులకు విజయవాడ(Vijayawada) పర్యటన మధురానుభూతులను మిగిల్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతి కమిటీ స్ఫూర్తికి అనుగుణంగా ముందడుగు వేద్దామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా(social media)లో వదంతులు వ్యాప్తిచేసే వారిపై పటిష్ట నిఘా ఉంటుందని.. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిభావంతో ప్రతి పండగనూ, ఉత్సవాలను జరుపుతామని.. ఇలాంటి వాతావరణానికి ఇబ్బంది కలిగించాలని ప్రయత్నించే వారిపై డేగ కన్నుఉంటుందని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ(traffic control), భక్తుల భద్రత, పార్కింగ్ సదుపాయాలు, సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా.. ఇలా ప్రతివిషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
- విజయవాడ శాంతికి ప్రతీక..
విజయవాడ శాంతియుత వాతావరణానికి ప్రతీక అని, దసరా ఉత్సవాలను విజయవంతం చేయడంలో కీలక భాగస్వాములమవుతామని వివిధ మతాల పెద్దలు పేర్కొన్నారు. తమనుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయన్నారు. బుడమేరు(Budameru) వరదల సమయంలో ఐక్యతా భావంతో బాధితులకు అండగా నిలిచామని.. ఇలాంటి స్ఫూర్తితోనే మున్ముందు కూడా అడుగులు వేస్తామన్నారు. సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య(Kavuri Chaitanya), డీసీపీ కేజీవీ సరిత, ఎండోమెంట్ ఏసీ ఎన్.షణ్ముగం, డీఎండబ్ల్యూ అబ్దుల్ రబ్బానీ, వివిధ మతాల పెద్దలు హాజరయ్యారు.
