పట్టణ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా కృషి చేస్తా..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని ఒకటవ వార్డులో పాత బోరుని రీప్రెష్ చేస్తున్నామనిమున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ తెలిపారు. అదే విధంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలం సమీపిస్తున్న వేళ పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా ప్రజల నీటి కష్టాలు తీర్చడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమ్య రామచంద్ర ఒకటో వార్డు కౌన్సిలర్, బోడ రాధ, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి,కాట బత్తిని ఆంజనేయులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
