బోధన నైపుణ్యం పెంచండి
- విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
కర్నూలు, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్(Induction Training) శుక్రవారం నన్నూరు సమీపంలోని రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా వెబెక్స్(Webex) ద్వారా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసులు రాష్ట్ర స్థాయి అధికారులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.
బోధనా నైపుణ్యాలతోనే సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానం, విలువల బోధన ద్వారా నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది” అని కోన శశిధర్(Kona Shashidhar) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని, విద్యారంగంలో తమ పాత్ర భవిష్యత్ తరాల భవితవ్యాన్నిమలచేదిగా ఉండాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్(S. Samuel Paul) మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే విశేషంగా కర్నూలుకు పోస్టులు మంజూరైనట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దాదాపు అన్నిపోస్టులు భర్తీ చేయగలిగామన్నారు. ఇకపై విద్యారంగంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపే కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిసోర్స్ పర్సన్స్(Resource Persons) ప్రణాళికాబద్ధంగా గమనికలు తీసుకుని ఆచరణాత్మక కృషి చేయాలని సూచించారు.

