11 నెలల బాబుతో ఎన్నికల విధులకు ఉద్యోగిని..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు 11 నెలల బాబుతో వచ్చిన ఓ ఉద్యోగిని అందరి దృష్టిని ఆకర్షించింది.

మంగళవారం భీమ్‌గల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి, తన ఎన్నికల సామగ్రిని స్వీకరించేందుకు ఉద్యోగిని సుమలత హాజరయ్యారు. ఆమె నందిపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా, 11 నెలల చిన్నారిని వెంట తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం పలువురిని ఆకట్టుకుంది. విధుల పట్ల ఆమె చూపిన బాధ్యతాభావం ప్రశంసనీయమని అక్కడున్న అధికారులు, సిబ్బంది కొనియాడారు.

Leave a Reply