ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ఏలూరు శ్రీ చైతన్య విద్యార్థులు..

ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ఏలూరు శ్రీ చైతన్య విద్యార్థులు..
ఏలూరు ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : ఏలూరులోని స్థానిక బాలాజీ నగర్ శ్రీ చైతన్య పాఠశాల అమెరికన్స్ నాసాలో (నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్) 31 దేశాలలో 29 వేల విద్యార్థులు పాల్గొనగా ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానాన్ని శ్రీ చైతన్య సాధించిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంత్రి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నాసా పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించేందుకు ఒక అభినందన సభను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం పార్థసారథి, పాఠశాలల ఆర్.ఐ. ఉదయ భాస్కర్, ఉన్నత పాఠశాలలో కో ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, పాఠశాల డీన్ సుధాకర్, ఫిజిక్స్ హెచ్.ఓ.డి. వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. శ్రీ చైతన్య విద్యార్థులు మేధా సంపత్తి ఒక్క పాఠశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుందని ఈ నాసా రికార్డు చెప్పకనే చెప్పింది అని ఆయన అన్నారు.
