ఘనంగా ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి వేడుకలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి వేడుకలను శనివారం చౌటుప్పల్ పట్టణంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలిమినేటి మాధవరెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలగ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, పిల్లలమరి మధుసూదన్, ఎండి హన్ను, వివిధ పార్టీల నాయకులు బడుగు లక్ష్మయ్య, సామిడి రాఘవరెడ్డి, చెన్నగోని అంజయ్య గౌడ్, చామకూర రాజయ్య, బొంగు శీను గౌడ్, సుర్కంటి బాలకృష్ణారెడ్డి, వెంకటేష్, సురేష్ తదితర టిడిపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాధవరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply