Electronic voting | ఈవీఎం గోదాంల త‌నిఖీ

Electronic voting | ఈవీఎం గోదాంల త‌నిఖీ

  • గట్టి భద్రత ఏర్పాటు చేయాలి
  • కలెక్టర్ డీకే బాలాజీ

Electronic voting | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఈవీఎం గోదాం వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు ఉండేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్(Electronic voting) యంత్రాలను నిల్వఉంచిన గోదాంను త్రైమాసిక తనిఖీలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. తనిఖీ పుస్తకంలో కలెక్టర్ తోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు.

గోదాంలో ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ సౌకర్యం(electricity facility)పై ఆరా తీశారు. తనిఖీలో డీఆర్ఓ కే.చంద్రశేఖర రావు, ఈవీఎం నోడల్ అధికారి నిత్యానందం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కార్యాలయ కార్యదర్శి దాసు, సీపీఎం, బీజేపీ, వైసీపీ, బీఎస్పి పార్టీల ప్రతినిధులు సుబ్రమణ్యం, పంతం గజేంద్ర రావు, సిలార్ దాదా, బాలాజీ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి శ్యామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Electronic voting |

Leave a Reply