Electricity | రైతు సంక్షేమమే ధ్యేయంగా పొలంబాట

Electricity | రైతు సంక్షేమమే ధ్యేయంగా పొలంబాట
- ఎన్పీడిసీఎల్ ఏఈ శిరీష్ కుమార్
Electricity | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా, మెరుగైన విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా విద్యుత్(electricity) శాఖ ముందుకు సాగుతుందని ఎన్పీడీసీఎల్ హసన్ పర్తి ఏఈ చుంచు శిరీస్ కుమార్ అన్నారు. ఇవాళ హసన్ పర్తి మండలం అనంతసాగర్ లో ఏఈ ఆధ్వర్యంలో విద్యుశాఖ సిబ్బంది, ఉన్నత ఆదేశాల మేరకు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు.
ఏఈ మాట్లాడుతూ… విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 1912 టోల్ ఫ్రీ నెంబర్(1912 toll free number) కి ఫిర్యాదు చేయాలని కోరారు. రైతులు వ్యవసాయ బోర్డులకు కెపాసిటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ సరఫరా చేసే క్రమంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తక్షణమే సమాచారాన్ని తమకు చేరవేయాలని కోరారు.
ఎలాంటి విద్యుత్ మరమ్మతులకైనా సొంతంగా ప్రయత్నించవద్దని, స్థానిక సిబ్బంది సహకారం తీసుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు పొలంబాట నిర్వహించి విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ స్వామి నాయక్, లైన్ ఇన్ స్పెక్టర్ రవీందర్, లైన్ మెన్, అసిస్టెంట్ లైన్ మెన్(line men) లు రాజమొగిళి, శ్రీనివాస్ తో పాటు విద్యుత్ సిబ్ధంది వాజీద్, రాజు, కిషన్ లు పేర్కొన్నారు.
