
Electrical wires | కరెంటు వైర్లతో కష్టాలు..
Electrical wires | కరెంటు వైర్లతో కష్టాలు..
- ప్రమాదపంచున రైతులు…
- పలుమార్లు విన్నవించిన పట్టించుకోని అధికారులు….
Electrical wires | వెల్దండ, ఆంధ్రప్రభ : నేలమట్టంలో కరెంటు వైర్ ఆదమరిచామా అంతమే రైతుల ప్రాణాలతో చెలగాటమా..?చూసిన చూడనట్టు వ్యవహరిస్తున్న కరెంటు సిబ్బంది… మండల సమీపంలోని రాచూర్ నుండి తిమ్మినోనిపల్లికి వేల్లే(LT)ఎల్టి లైన్ కి సంబంధించిన కరెంటు వైర్లు నేలమట్టంలో వేలాడడంతో మనిషికి చెయ్యెత్తితే అందెంత క్రిందికి ఉండటంవలన ఎప్పుడు కరెంట్ బారినపడి ప్రమాదానికి గురవుతామోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.
వ్యవసాయ పొలంలో సేద్యం చేయాలంటే కరెంట్ వైర్ల భయంతో వ్యవసాయం బంధుచేశినట్టు రైతు తెలిపారు. ఆదమర్చి పైకి చేతులు ఎత్తమా అనంతలోకానికి వెళ్లడం ఖాయమన్నారు.
