Electrical line | విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ మృతి

Electrical line | విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ మృతి

Electrical line | తెనాలి, ఆంధ్రప్రభ : తెనాలి పట్టణంలోని అమరావతి కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేమూరు ఎలక్ట్రికల్ లైన్ ఇన్‌స్పెక్టర్ షేక్ అబ్దుల్ గౌస్ (57) అపార్ట్మెంట్ పైకి (టెర్రస్‌పై) నుంచి పడి మృతి చెందారు. ప్రతిరోజూ ఉదయం టెర్రస్‌పై నడక (వాకింగ్) చేసే ఆయన, బుధవారం కూడా అలాగే వాకింగ్ చేస్తుండగా కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు కిందపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌తో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.

click here to read more : Telangana | అనుమానాస్ప‌ద రీతిలో….

click here to read more

Leave a Reply