ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

  • వెస్ట్ జోన్ డిసిపి బి రాజమహేంద్ర నాయక్

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి మండలంలోని 40 గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ఏర్పాటుచేసిన 13 క్లస్టర్ నామినేషన్ సెంటర్లను వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వర్ధన్నపేట ఏసిపి అంబాటి నరసయ్య, పాలకుర్తి సీఐ,ఎస్సైలు ముత్యం రాజేందర్, మేకల లింగారెడ్డి తో కలిసి నామినేషన్ సెంటర్లను పరిశీలించి. అన్ని గ్రామాల ప్రజలు, అఖిలపక్ష రాజకీయ నేతలు సహకరించాలని అన్నారు.

గ్రామాల్లో శాంతి భద్రతల పైన పర్యవేక్షణ ఉండాలని,గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉండాలని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీలేదని ఎలాంటి అవాంఛిత పరిణామాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు భరోసా కల్పించే వాతావరణం సృష్టించాలని అన్నారు.

అలాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమ డబ్బు,మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు ఎక్కడైనా గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.

Leave a Reply