Elections | పాలమూరులో 27 శాతం పోలింగ్..

Elections | పాలమూరు, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 21 డివిజన్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టెంటు వేయడంతో బిజెపి పార్టీ అభ్యర్థి అడ్డుకోవడంతో ఉద్రిక్తత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలు. ఇదే కార్పొరేషన్ 45వ డివిజన్లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో అభ్యర్థులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో 20 నిమిషాలు ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని 46వ డివిజన్ ఎన్నికల కేంద్రాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఓటర్ల మదిని దోచారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో ఉదయం నుండి ఓటర్లు బారులు తీరారు.ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం భూత్పూర్ లో 12.91శాతం,దేవరకద్ర 17.98 శాతం మహబూబ్ నగర్ 12.36 శాతం. పురపోరు ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా ధైర్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
