Election Code | నిబంధనలు ఉల్లంఘించొద్దు..
- ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
- నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు
- ఎన్నికలు నిర్వహణకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు
- వైరా ఎస్సై పుష్పాల రామారావు
Election Code | వైరా, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 17వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఊరేగింపులకు, గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఎస్సై పుష్పాల రామారావు పేర్కొన్నారు. మోడల్ కోడ్ నేపథ్యంలో ఊరేగింపులకు అనుమతి లేదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గెలుపొందిన అభ్యర్థులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు వైరా మండలంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు, అన్ని రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

