Election | నూతన కమిటీ ఎన్నిక..

Election | ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని సేవ్యా నాయక్ తండ గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ జగదంబ సేవాలాల్ గుడికి ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుడి అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల సమర్థ నిర్వహణ లక్ష్యంగా కమిటీ బాధ్యతలు స్వీకరించినట్లు సభ్యులు తెలిపారు. చైర్మన్‌లుగా బిలావత్ రాజేష్, భూక్యా ఉత్తం, కోశాధికారిగా బోడ గణేష్, సభ్యులుగా బిలవత్ మంగ్త్య, గుగ్లావత్ వాలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ పెద్దలు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోపి నాయక్, బిలావత్ లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
