ఐషర్‌ కంపెనీ బరితెగింపు

  • భారీ ఎత్తున షెడ్‌ నిర్మాణం
  • ఎల్లంపేట్‌ మున్సిపల్‌లో వెలుగు చూసిన అక్రమం

మేడ్చల్‌, (ఆంధ్రప్రభ) : మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపాలి టీలో అక్రమ నిర్మాణదారులు పెట్రేగిపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తులతో పాటు షెడ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎల్లంపేట మున్సిపల్‌ నడిబొడ్డున ఐషర్‌ కంపెనీ తమ కంపెనీ వాహనాలను విక్రయించేందుకు భారీ ఎత్తున మున్సిపల్‌ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్డుని నిర్మించింది.

అక్రమ నిర్మాణాలు అడ్డుకోవా ల్సిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పటంతో అటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అయినప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి టౌన్‌ ప్లానింగ్‌ పగ్గాలు అప్పగించటంతో ఆయన అవినీతి అక్రమాలకు హద్దు లేకుండా పోతోందని స్థానిక ప్రజలు బహిరంగగానే ఆరోపిస్తున్నారు.

దీంతో మున్సిపల్‌ ఆదాయనికి గండి కొడుతూ తమ స్వలాభంకోసం అక్రమాలకు తెగబడుతున్నాడని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌తో పాటు ఉన్నత అధికారులు స్పందించి ఐషర్‌ కంపెనీ అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డుపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply