TEMPLE | ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి

- భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు
- పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
TEMPLE | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: దేవాలయాలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా అయ్యేలా ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. వీరవాసరంలోని కనకదుర్గ (Kanakadurga) అమ్మవారి దేవస్థానం, వేణుగోపాల సీతారామ స్వామి దేవస్థానం, వీరేశ్వర విశ్వేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన, ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మత్స్యపురి రోడ్డులోని శివాలయ ప్రాంగణంలో నిర్వహించారు. వీరేశ్వర విశ్వేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్‌గా మద్దాల శ్రీరామకృష్ణ, సభ్యులుగా ఎం.లక్ష్మణ రావు, ఎన్. కృష్ణవేణి, కె.కృష్ణ కిషోర్, వి. వెంకట సత్యనారాయణ, జి. శ్రీనివాసరావు, ఎ.వరలక్ష్మీ, బి దానమ్మ, జి రవళి లు ప్రమాణ స్వీకారం చేశారు.
వేణుగోపాల సీతారామ స్వామి (Venugopala Sitarama Swamy) దేవస్థాన చైర్మన్‌గా కుక్కల సత్యనారాయణ, సభ్యులుగా ఎం. హరికృష్ణ, పి.కనకదుర్గ, వెంకట సుబ్రహ్మణ్యం, బి. మోహన నాగ సత్యనారాయణ, కే. పార్వతి, ఎ. నిర్మల, బి. ముత్యాలు, ఎన్. బాల మల్లేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు.
కనకదుర్గ అమ్మవారి దేవస్థాన చైర్మన్ గా మెడిశెట్టి కృష్ణారావు, సభ్యులుగా ఎం శ్రీను, జి రాధ, సులోచన, ఎస్. జ్యోతి కృష్ణవేణి, ఎస్. లక్ష్మీ నారాయణ, జి పద్మజ, కె. జగదీశ్వరి, జి పెద్దిరాజు, సీహెచ్ సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో ఆలయ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ ప్రతిష్ట, ఆస్తులను పరిరక్షించాలన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావనతో సేవలు అందించాలన్నారు. పొలిట్ బ్యూరో (Politburo) సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
