ఉత్తరాదిన ఆకస్మిక వ‌ర‌ద‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆకస్మిక వరదలు కారణంగా హిమాచల్​ ప్రదేశ్​ (Himachal Pradesh)లో అకస్మాత్తుగా కొండయచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లోనూ నలుగురు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఇక జమ్ముకశ్మీర్​(Jammu and Kashmir)లోనూ భారీ వర్షాలు కారణంగా నదులు పొంగిపోర్లుతున్నాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల అనేక ఇళ్లు నీట మునిగాయి. దిల్లీలోని యమునా నది (Yamuna River) ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని లోక్​సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విమాన సర్వీసులు నిలిపివేత
ఈ ప్రతికూల వాతావరణాల కారణంగా లేహ్​కు వెళ్లే విమాన సర్వీసుల(air services)ను నిలిపివేస్తున్నట్లు దిల్లీ విమానాశ్రయం పేర్కొంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానాలు తిరిగి ప్రారంభయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు పంజాబ్​లో కూడా సెప్టెంబర్​ 7 వరకు విద్యా సంస్థల(educational institutions)కు సెలవులు ప్రకటించారు.

Leave a Reply