EDITORIAL | మన రాజ్యాంగం పరవెూత్కృష్టం

EDITORIAL | మన రాజ్యాంగం పరవెూత్కృష్టం

రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం దేశ ప్రజలు జరుపుకున్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఏర్పాటైన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటూ భారత రాజ్యాంగం ప్రత్యేకతలను అభివర్ణించారు. విశ్వబంధుగా భారత్‌ ప్రస్థానం రాజ్యాంగ గొప్పతనమన్నారు. ప్రపంచంలోని రాజ్యాంగాలన్నింటిలో విశిష్టమైనది అయిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో రాజ్యాంగాలు ఒడిదుడుకులకు గురి అయ్యాయి. మన రాజ్యాంగాన్ని ప్రజల అభిమతానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నామే తప్ప ఇంతవరకూ రద్దు కాలేదు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ తదితరులు హాజరయ్యారు.

మన రాజ్యాంగం ఎందుకు విశిష్టమైనది అంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో సార్లు సవరణలకు నోచుకుంది. అయితే, మౌలికాంశాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వివిధ దేశాల్లోని రాజ్యాంగాలను లోతుగా పరిశీలించి, క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు.

మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వచ్చినా రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నాయి. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగంలోని 370 అధిక రణాన్ని రద్దు చేసుకున్నాం.

అలాగే , మహిళల పట్ల వివక్ష చూపే త్రిపుల్‌ తలాక్‌ ను రద్దు చేయడం ద్వారా మహిళల సమాన ప్రతిపత్తి కల్పించడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొనగా, వికసిత్ భారత్‌ లక్ష్యంగా మన దేశం ముందుకు సాగుతున్న తరుణంలో రాజ్యాంగ దినోత్సవం మనకు ఎంతో విలువైనదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మన రాజ్యాంగం 22 భాగాలు, 395 అధికరణాలు, 8 షెడ్యూళ్లతో ప్రారం భమైంది. సవరణల తర్వాత ప్రస్తుతం 448 అధికరణా లు, 12 షెడ్యూల్స్‌ ఉన్నాయి. ప్రధానమంత్రి, మంత్రులు, రాష్ట్రాల్లో మంత్రులు న్యాయమూర్తులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులను చేపడతారు. మన రాజ్యాంగలోని ముఖ్య లక్షణాలు ఏమిటంటే, లౌకక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం.

ప్రాథమిక హక్కులు, నిర్దేశిక సూత్రాలు, సమాఖ్య వాదం, సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి. ఏటా నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినో త్సవాన్ని జరుపుకోవాలని 2015లో గెజిట్‌ ద్వారా ప్రక టన చేశారు. మన రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీనుంచి అమలులోకి వచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటిలో సమానత్వపు హక్కు ముఖ్యమైనది.

అలాగే, ఆస్తి హక్కు, మత స్వేచ్ఛ మొదలైనవి కూడా ముఖ్యమైనవే. మరే దేశంలోనూ, ఈ మాదిరి స్వేచ్ఛ లేదు. సాంస్కృతిక, విద్యా హక్కులు కూడా ఉన్నాయి. మత స్వాతంత్య్ర హక్కు కూడా ఉంది. మన దేశంలో జాతి, మత, కుల, భాషా భేదం లేకుండా ప్రజలందరికీ సమానత్వ హోదాని కల్పిస్తుంది.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సోషలిస్టు సెక్యులర్‌ హక్కులను రాజ్యాంగంలో చేర్చారు. 19వ అధికరణం ప్రకారం ప్రతిఒక్కరి భావ ప్రకటనా హక్కు ఉంది. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవిం చే హక్కు కల్పించబడింది. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కును పరిరక్షిస్తుంది. ప్రతి పౌరుని స్వేచ్ఛను పరిరక్షిస్తుంది.

మైనారిటీల హక్కు లను పరిరక్షిస్తుంది. భావ వ్యక్తీకరణ హక్కును పరిర క్షిస్తుంది. ఆర్టికల్‌ 142రాజ్యాంగ పర్యవేక్షకునిగా సుప్రీం కోర్టు పాత్రను ఉన్నతీకరిస్తుంది. మన రాజ్యాంగం ప్రజల హక్కులను పరిరక్షించడమే కాకుండా, వారి జీవన పురోభివృద్ధికి దోహదం చేస్తున్నది.

రాజ్యాంగం సవరణల విషయంలో పరిమితు లను నిర్దేశిస్తుంది. ఆస్తి హక్కు విషయంలో కేరళలోని ఒక మఠానికి చెందిన కేశవానంద భారతి కేసులో రా జ్యాంగం మూల సూత్రాలను మార్చే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మన దేశంలో వ్యక్తుల, సంస్థల హక్కు ల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిలో ఇది చారిత్రాత్మకమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కు కారణంగానే ఈ కేసులో కేశవానంద భారతి సుప్రీం కోర్టు వరకూ వెళ్ళి విజయం సాధించారు.

Leave a Reply