EC | 345 రాజకీయ పార్టీలు డీ లిస్ట్ !

కేంద్ర ఎన్నికల సంఘం (EC) దేశవ్యాప్తంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఎలాంటి పాత్ర లేకుండా నామమాత్రంగా నమోదు చేసుకున్న రాజకీయ పార్టీలపై చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా 345 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేయాలన్న ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. 2019 తర్వాత ఏ ఎన్నికలలోనూ పాల్గొనని పార్టీలే ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుతం చట్టం ప్రకారం, ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే, ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించాలి. కానీ చాలా పార్టీలు అలా చేయకుండా, పేరుకే పార్టీగా ఉండటంతో, అవి దుర్వినియోగానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని EC అభిప్రాయపడింది. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ముందడుగు వేసింది.

Leave a Reply