Earthquakes | రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

Earthquakes | రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

Earthquakes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా మిస్సైల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా… మరోవైపు దేశంలో భూకంపాలు భయానకంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.

ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండోసారి భూకంపాలు రావడంతో ఇరాన్‌లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఒకవైపు యుద్ధ బాంబులు… మరోవైపు ప్రకృతి ప్రకోపం… ఇరాన్ ప్రజలు రెండు భయాల మధ్య చిక్కుకుపోయారు.

Leave a Reply