Bhupalpally | అసత్య ప్రచారంపై పోలీస్ స్టేషన్ లో డీడబ్ల్యూఓ ఫిర్యాదు

భూపాలపల్లి, జులై 9 (ఆంధ్రప్రభ) : తనపై వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తూ విధులకు ఆటంకాలు కలిగిస్తున్న వ్యక్తిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారి జి.మల్లీశ్వరి (Mallishwari) భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి జిల్లా పలు వాట్సప్ గ్రూపుల్లో అంగన్వాడీ టీచర్ల (Anganwadi teachers) వద్ద నుండి తాను నెలకు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు నిరాధారణమైన, అసత్య ఆరోపణలు (False accusations) చేశారు. అసత్య పోస్టు పెట్టి తన విధులకు ఆటంకం కలిగించేలా, తన గౌరవాన్ని కించపరిచేలా పోస్ట్ పెట్టిన సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎచ్ఓ కు ఫిర్యాదు చేసినట్లు డీడబ్ల్యూవో మల్లీశ్వరి తెలిపారు.

Leave a Reply