Durgi | యువకుడి మృతదేహం ల‌భ్యం

Durgi | యువకుడి మృతదేహం ల‌భ్యం

  • అడిగొప్పుల శివారులోని నల్లవాగులో బయట పడిన శ‌వం

Durgi | దుర్గి, ఆంధ్రప్రభ : దుర్గి మండలం, అడిగొప్పుల శివారులో ఉన్న నల్లవాగులో ఓ యువకుడు పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం దాచేపల్లి మండలం, పెదగార్లపాడు గ్రామానికి చెందిన ఇమ్మిడి శెట్టి నాగరాజు (29సం.లు) కులం తెలగ. బ‌తుకు దెరువు కోసం దుర్గి గ్రామానికి వచ్చి లోఓడాల్ మిల్లులో పని చేస్తూ స్థానికంగా కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. జనవరి 1న గురువారం తన స్వగ్రామానికి బైక్ పై స్పీడ్‌గా వెళ్తూ మార్గమధ్యంలో అడిగొప్పుల శివారులో ఉన్న నల్లవాగు మలుపు వద్ద బైక్ కంట్రోల్ కాక అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్ళి చ‌నిపోయిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. బైక్ కూడా అక్కడే ఉన్న ట్లు గుర్తించారు. ఈ సంఘటన ఆ రోజు ఎవరూ గుర్తించక పోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై సుధీర్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. నాగరాజు కు భార్య హరితతో పాటు ఇద్దరు పిల్ల‌లు ఉన్నారు.

Leave a Reply