KANAKA DURGA | అంకితభావంతో బాధ్యతలు నిర్వ‌ర్తించాలి

  • సమన్వయంతో దీక్షల విరమణ పూర్తి చేయాలి
  • దుర్గగుడి చైర్మన్ బుర్ర గాంధీ ఈవో శీనా నాయక్..
  • భవానీ దీక్షల విరమణ పై సమీక్ష..

KANAKA DURGA | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించడంతోపాటు అవసరమైన చర్యలన్నీ సమన్వయంతో సిబ్బంది అధికారులు తీసుకోవాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ కార్యనిర్వాహన అధికారి శీనా నాయక్ లు సూచించారు. డిసెంబర్లో జరిగే భవానీ దీక్షల విరమణ సందర్భంగా అంకితభావంతో బాధ్యతలు నిర్వహించాలన్నారు. భవానీ దీక్షలు విరమణ-2025 సందర్బంగా చేయబోయే ఏర్పాట్లు కోసం ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వాహణాధికారి వి. కే. శీనానాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామంటపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజినీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు.

డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సందర్బంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు ఏర్పాటు, అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కోరారు. దర్శన క్యూలైన్లు, మంచి నీరు ఏర్పాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు, గిరి ప్రదక్షిణ మార్గం, కేశఖండన ఏర్పాటు, భక్తుల పుణ్యస్నానాలు ఏర్పాటు సరైన రీతిలో జరగాలని, మైక్ ప్రచారం, ఉచిత బస్ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. రేపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖలతో జరిగే భవాని దీక్షల సమావేశం లో మరిన్ని నిర్ణయాలు పై చర్చించి నిర్ణయాలు ఉంటాయని, ఈ సంవత్సరం దీక్షా విరమణ కి భక్తులసంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తం గా విధులు నిర్వర్తించాలని సిబ్బంది ని ఈవో కోరారు.

Leave a Reply