Dry Day | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Dry Day | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బిక్కనూరు మండల వైద్యాధికారి దివ్య చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఫ్రైడే అండ్ డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి నిల్వ ఉంచుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి తొట్టిలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాపించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు .ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సూపర్వైజర్ రాజమణి, సువర్ణ ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply