Drunk and Drive | రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలే…
- మద్యం మత్తులో డ్రైవింగ్ వల్లే యాక్సిడెంట్స్
- సురక్షిత ప్రయాణానికి రూల్స్ పాటించండి
- తనిఖీలు మరింత పెంచుతాం
- డ్రంకన్ అండ్ డ్రైవ్ పై సీరియస్ యాక్షన్
- వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ
Drunk and Drive | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ నిబంధనలను పాటించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్య నారాయణ(Traffic ACP Satya Narayana) ఆందోళన వెలిబుచ్చారు. ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసమే రూల్స్ ఏర్పరచారని గుర్తించి మసులుకోవాలని సూచించారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోతున్నారని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గుర్తు చేశారు. వరంగల్ ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో రీజోనెన్స్ జూనియర్ కాలేజీ(Resonance Junior College) తరపున ట్రాఫిక్ రూల్స్, వాటి ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కోడూరు సుజాత అధ్యక్షత వహించారు.
ట్రాఫిక్ రూల్స్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకై నగరంలో తనిఖీలు మరింత పెంచనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడే మందు బాబుల సంఖ్య పెరుగుతుందన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకై డ్రంకన్ అండ్ డ్రైవ్(Drunk and Drive) టెస్టులు మరింతగా పెంచి,కట్టడి చేస్తామన్నారు.
డ్రైవింగ్ చేసే వారంతా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తే ప్రమాదాలన నివారించవచ్చునని పేర్కొన్నారు. హెల్మెట్ లేని ప్రయాణం చేయొద్దని, ఫోర్ వీలర్ డ్రైవ్ చేసేవారు సీటు బెల్టు ధరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఆచరిస్తూ సురక్షిత ప్రయాణాలు సాగించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సూచించారు.
ప్రజల కోసమే ప్రభుత్వం రూల్స్ ను రూపొందించారని గుర్తించి తప్పనిసరిగా ఆచరించాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కోడూరు సుజాత(Inspector Koduru Sujatha) సూచించారు.


