DRF Staff | పాపం ఇద్దరు బాలురు….

DRF Staff | పాపం ఇద్దరు బాలురు….

DRF Staff | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విషాదం నెలకొంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో ఉన్న పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

చెరువులో మునిగిపోయిన బాలుర మృతదేహాలను డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెరువు ప్రమాదకరంగా ఉండటం, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి అంశాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply