నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా

వేంసూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలగారపు చెన్నారావు, యేసుమణి దంపతుల కుమారుడు రాహుల్, యశ్వంతి వివాహ వేడుకలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కందుకూరు గ్రామంలో జరిగిన ఈ వివాహ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖరరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గొర్ల వెంకటప్పారెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వరచారి, తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply