Donald Trump | ఎంతకాలం చెల్లుతుంది

Donald Trump | ఎంతకాలం చెల్లుతుంది

Donald Trump | ఆంధ్రప్రభ : తాను సంతోషంగా లేనన్న సంగతి భారత ప్రధాని మోడీకి తెలుసు ననీ, త్వరలోనే భారత్‌పై మరికొన్ని ఆంక్షలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చేసిన ప్రకటన ఆయన దురంహంకారాన్ని తెలియజేస్తోంది. తాను సంతోషంగా లేకపోతే భారత్‌పై ఆంక్షలు విధిస్తాన నడం ఎంతటి గొప్పవానికైనా తగదు. యావత్‌ ప్రపంచానికీ తాను రారాజు నని ట్రంప్‌ భావిస్తున్నారు. అలనాటి రాజులే మట్టి కరిచి పోయారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో అహంకారం తల కెక్కింది. యావత్‌ ప్రపంచం తన కాళ్ళ క్రింద ఉండాలన్న అభిమతం ఆయన మాటల్లో చేతల్లో కనిపిస్తోంది.

Donald Trump

Donald Trump | అమెరికా, రష్యాలు ఒకప్పుడు అగ్రరాజ్యాలు

అమెరికా అధ్యక్షులుగా గతంలో వ్యవహరించిన వారెవరూ ఇంత బరితెగించి మాట్లాడలేదు. ఇంతకీ మన దేశంపై ఆయన కోపం అల్లా రష్యా (Rissia) నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నామని. రష్యాతో ఆయనకు వైరం ఉండవచ్చు. మనకు లేదు. అమెరికా, రష్యాలు ఒకప్పుడు అగ్రరాజ్యాలు. ఇప్పుడు రష్యా ఆ హోదాని కోల్పోయినప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాభవాన్ని చాటుతూనే ఉంది. రష్యాతో మన బంధం ఈనాటిది కాదు. దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతోంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో కూడా మన దేశం అమె రికా, రష్యాలను సమానదూరంలో ఉంచి దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఎంతో మంది అమెరికా మాజీ అధ్యక్షులు భారత విధానాన్ని మెచ్చుకున్నారు.

Donald Trump

Donald Trump | అది పుతిన్‌ సహృతదయతకు నిదర్శనం

అలాగే, రష్యా మన దేశం అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను తప్పు పట్టలేదు. ఉక్రెయిన్‌పై రష్యా (Ukraine Russia) దాడి విషయంలో మన దేశం తటస్థ వైఖరిని అనుసరిస్తున్నా, ఏనాడూ మన విషయంలో పరుషంగా మాట్లాడలేదు. గత నెలలో మన దేశంలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మన విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. అది ఆయన సహృతదయతకు నిదర్శనం. తన శత్రు దేశంతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్నా, పుతిన్‌ ఎంతో విశాల హృదయంతో మన ప్రధానితో సంప్రదింపులు జరిపారు. ఒప్పందాలను చేసుకున్నారు.

Donald Trump

మనతోనే కాదు, అందరితో పుతిన్‌ ఇదే మాదిరిగా వ్యవహరిస్తూ అగ్ర రాజ్యంగా తమ హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు. ట్రంప్‌ (Trump) వ్యాఖ్యలు, బెదిరింపులు ఉడుకుమోత ధోరణిని పోలి ఉన్నాయి. అగ్రరాజ్యాధిపత్యం అనేది కోరుకుంటే రాదు. తన ప్రవర్తన, మాటతీరును బట్టి వస్తుందనే విషయం ట్రంప్‌కి తెలియకపోవడం దురదృష్టకరం. అమెరికాలో ఇప్పుడు పరిస్థితి చూస్తే ట్రంప్‌ పాలన ఎలా ఉందో తెలుస్తుంది. అక్కడి ప్రజలే ఆయ నను అసహ్యించుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకున్న ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్‌ మస్క్‌ ఆయన ధోరణి నచ్చకే దూరమయ్యారు.

Donald Trump

Donald Trump | ట్రంప్‌ అధికారంలోకి వచ్చేముందు

అలాగే, దేశంలో చాలామంది శాస్త్రజ్ఞులు, మేధావులు ట్రంప్‌ తీరుతెన్నులపై మండిపడుతున్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చేముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. వాటిల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. దాంతో ప్రజలు (People) తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరో వంక నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Donald Trump

CLICK HERE TO READ జపాన్‌లో భూకంపం… తీవ్రత 6.2

CLICK HERE TO READ MORE

Leave a Reply