రోబో.. నిజంగా అలా చేస్తుందా..?

రోబో.. నిజంగా అలా చేస్తుందా..?

టెక్నాలజీ రంగంలో చైనా దూసుకుపోతుంది. ఈ రంగంలో చైనాకు చెందిన ఒక కంపెనీ సంచలన ఆవిష్కరణ చేసింది. ఎలక్రిక్ వాహనాల తయారీ కంపెనీ జీపింగ్ ఐరాన్ పేరుతో కొత్త హ్యుమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. ఈ రోబోట్ అచ్చం మనిషిలా నడుస్తుంది. ఇది రోబోట్ అని చెప్పకుంటే మనిషి ముసుగు వేసుకుని వచ్చాడని భ్రమించేలా దీని కదలికలు ఉన్నాయి. దీన్ని నిరూపించేందుకు కంపెనీ స్టేజ్ పైనే రోబో ఒక కాలుపై ఉన్న కవర్ ను కట్ చేసి చూపించింది. ఈ రోబో 82 డిగ్రీల స్వేచ్చతో వస్తుంది.

ప్రతి చేతిలో 22 డిగ్రీల ప్రీడంతో సహా దాని శరీరం అంతా బహుళ పాయింట్లు ఉన్నాయి. దీని వలన వంగడానికి సైగలు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది అంతర్గత ఎండోస్కెఎలిటన్, బయోనిక్ కండరాల నిర్మాణాన్ని కలిగి ఉంటుందని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ హెజిన్ పెంగ్ తెలిపారు. దీని శరీర చర్మ నిర్మాణాన్ని సింధటిక్ తో తయారు చేశారు. టెక్ ప్రపంచంలో ఈ రోబో సంచలనంగా మారింది.

Leave a Reply