వెంకన్న, రావత్‌లకు డాక్టరేట్ల ప్రదానం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంబేడ్కర్ యూనివర్సిటీ(Ambedkar University) 26వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత గోరటి వెంకన్న((Gorati Venkanna), శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్‌కు గౌరవ డాక్టర్లను ప్రదానం చేశారు.
ఈ రోజు స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణదేవ్ వర్(Jishnadev Var) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహిత్య విభాగంలో చేస్తున్న సేవలకు గానురచయిత, ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో పాటు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్(Prem Rawat)లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ ప్రదానం చేశారు.
పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచడం, నేరాల శాతం తగ్గించేందుకు కృషి చేస్తునందుకు గాను ప్రేమ్ రావత్ డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా 86 మంది విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు 60,288 మందికి పట్టాలను ప్రదానం చేశారు. అలాగే 203 మంది ఖైదీలకు(prisoners) డిగ్రీ పట్టాలిచ్చారు. వారిలో ఇద్దరు బంగారు పతకాలను అందుకున్నారు.

