ఇసుక రవాణాకి అనుమతి ఇవ్వొద్దు..

ఇసుక రవాణాకి అనుమతి ఇవ్వొద్దు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు కేవలం మూసీ, బిక్కేరు వాగుల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, బిక్కేర్ లో ఇసుక తీసేందుకు అనుమతి ఇవ్వొద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అసెంబ్లీలో మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఇటీవల బిక్కేర్ లో ఇసుకను తీసేందుకు సర్వే నిమిత్తం అధికారులను పంపారని, బిక్కేర్ లో ఇసుక తీసేందుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, మైనింగ్ శాఖ ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని సంబంధిత మంత్రి, సీఎం రేవంత్ లకు విన్నవించారు. మూసీనదిలో 50 ఏళ్ళు ఇసుక రవాణాకి అనుమతి ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏదేచ్ఛగా తీసుకెళ్లవచ్చని ఎమ్మెల్యే సామెల్ స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, టి ఏ,డి ఏ, ఆలవెన్స్ లు, పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
