శ్మ‌శానంలో దీపావ‌ళి

శ్మ‌శానంలో దీపావ‌ళి

కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : శ్మ‌శానంలోకి అడుగు పెట్టాలంటే చాల మంది భయపడుతూ ఉంటారు. కానీ కరీంనగర్(Karimnagar)లో ఆరు దశబ్దాలకు పైగా శ్మ‌శానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. పూర్వీకులను స్మరించుకుంటూ తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలోని సమాధుల‌ వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రం లోని కార్ఖన గడ్డలో ఉన్న హిందు శ్మ‌శాన వాటిక(Hindu Cemetery)లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. పండగకు వారం రోజుల ముందే శ్మ‌శాన వాటిక వద్ద స‌మాధుల‌ను శుభ్రం చేసి రంగులు వేశారు. పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గ‌డిపారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే.. తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

అందుకోసమే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెట్టారు. పితృ దేవతల(Ancestral Gods)కు నైవేద్యాలు సమర్పించిన అనంతరం వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేశారు.

Leave a Reply