పాఠకులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం..

పాఠకులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం డి అవేస్ చిస్తీ..
భువనగిరి, ఆంధ్రప్రభ : జిల్లాలోని గ్రంథాలయాలలో పాఠకులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తీ అన్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయ కార్యాలయం లో బడ్జెట్ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా 2026-27 బడ్జెట్ అంచనాల ఆమోదించి ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగుల కోసం దివ్యాంజన్ సెక్షన్ ను ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్ లతో పాటు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
