తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక

నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం ఉదయం 9.30 గంటల నుంచి రాజారం స్టేడియం, నాగారం, నిజామాబాద్‌లో నిర్వహించారు. మండల స్థాయి ఎంపికల్లో 41 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

వారిలో 37 మంది విద్యార్థులు జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యారు. ఇందులో 27 మంది బాలురు, 10 మంది బాలికలు పాల్గొన్నారు. ఎంపికల సందర్భంగా విద్యార్థుల బ్రాడ్ జంప్ , వర్టికల్ జంప్ ,మెడిసిన్ బాల్ త్రో , 6×10 పరుగు , ఎత్తు, బరువు ల ఆధారంగా ప్రతిభను పరిశీలించి ఉత్తమంగా ప్రదర్శన కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు.
జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులను ఏప్రిల్ 28 న నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపించనున్నట్లు జిల్లా యువజన క్రీడ అధికారి బి. పవన్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన రాష్ట్రస్థాయిలో సైతం రానించి రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ కు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. ఈ ఎంపిక ప్రక్రియలో వ్యాయామ ఉపాధ్యాయులు గోపిరెడ్డి, అమర్ వీర్ రెడ్డి, వెంకట్, సురేష్, ఈశ్వర్, మధు, స్పోర్ట్స్ సిబ్బంది సురేష్ గంగదాసు పాల్గొన్నారు..
