విద్యార్థిలకు వాటర్ బాటిల్స్ పంపిణీ..

దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు శుక్రవారం దమ్మపేట మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు వాటర్ బాటిల్స్, హాల్ టికెట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు మనో ధైర్యంతో, ప్రశాంతంగా పది పరీక్షలు వ్రాసి, మంచి మార్కులు సాధించి, విద్య నేర్పిన గురువులకు, కన్న తల్లి దండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని విద్యార్థినిలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి, దమ్మపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు యూత్ ఐకాన్ కాకా రమేష్, బొల్లికొండ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
