ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు కమ్మర్ పల్లి మండల తహసీల్దార్ జి. ప్రసాద్,గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా గురువారం చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ శైలందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తూ నిరుపేద ప్రజలకోసం వారి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు అలకుంటా జామున,షాహెదా బేగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శరత్, జిపిఓ సుమన్,ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, వార్డ్ మెంబర్లు సదుల్ల, అనిల్, అజయ్ మరియు సుంకరి విజయ్, నరేష్, ఆంజనేయులు, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
