మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి

మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళలు చదువుకొని అక్షరాస్యతలో ముందుండాలని మల్లారం గ్రామ సర్పంచ్ పొట్ల లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం మంథని మండలం మల్లారం గ్రామంలో ఉల్లాస్ నవ భారత్ ఆధ్వర్యంలో మహిళలకు విద్యపై అవగాహన కల్పించేందుకు పరీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి కుమారుడు సీనియర్ నాయకులు శ్రీకాంత్ మహిళలందరికీ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మహిళలు చదువు దేశానికి వెలుగు అని, మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి అని వివరించారు.
