సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం..

సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం..

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 44, పట్టణానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు రూ.20,20,500 లక్షల విలువచేసే చెక్కులను ఆదివారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని అన్నారు. నిరుపేదల వైద్య ఖర్చులకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పథ‌కం ద్వారా అందిస్తున్న సాయాన్ని ల‌బ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేదల ఇబ్బందులు గుర్తించి సీఎంఆర్ఎఫ్ సాయం తక్షణ మంజూరుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్దె లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం వినూత్నమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్ ముద్దసాని సురేష్, నాయకులు పింగిలి ఉష, ఇట్టే శ్యాంసుందర్ రెడ్డి, ముద్దం విక్రమ్ రెడ్డి,బసన బోయిన రాజేష్ యాదవ్, ముద్దం మహబూబ్ రెడ్డి, ప్రతి కంఠం దేవేందర్ రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply