Distribution | విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ

Distribution | విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ
Distribution | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని కారేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా, పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భీమ్గల్ జనసేన కో-ఆర్డినేటర్ ఆకాంక్షించారు. రేపటి తరానికి నాణ్యమైన విద్యను అందించడమే జనసేనాని ఆశయమని, దానికి అనుగుణంగానే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా పోషించినప్పుడు వారికి గుర్తింపు గా పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు దామా నవీన్, రామావత్ తిరుపతి, గుగులోత్ ఓం శ్రీనివాస్, అనిల్, కారేపల్లి గ్రామస్థులు ప్రేమ్,రామ్, పరమేష్, సురేష్, నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
